హాట్‌ బ్యూటీ కృతి సనన్‌ తెలుగులో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘1’ చిత్రంలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. తెలుగులో ఈమెకు ఆఫర్లు వస్తున్నప్పటికి బాలీవుడ్‌కే ఈమె పరిమితం అవుతుంది. బాలీవుడ్‌లో తాజాగా ఈమె ఒక పెద్ద సినిమాకు సైన్‌ చేసింది. ఇక ఈ అమ్మడు గత కొంత కాలంగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌తో సహజీవనం సాగిస్తుందని, ఈ అమ్మడు అతడితో అన్నింటికి సిద్దం అయ్యింది అంటూ బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

తాజాగా మీడియాతో మాట్లాడిన కృతి సనన్‌ ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నాను అని, రిలేషన్‌ షిప్‌లో లేను అంటూ తేల్చి పారేసింది. అయితే భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ వ్యక్తితో డేటింగ్‌ చేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని, ఒకే వృత్తికి చెందిన వ్యక్తితో రిలేషన్‌ షిప్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తాను అభిప్రాయ పడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అందుకే తన నెక్ట్‌ బాయ్‌ ఫ్రెండ్‌ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయ్యి ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. హీరో అయితే ఇంకా బెటర్‌ అని కూడా తన మనస్సులో మాట చెప్పుకొచ్చింది. హీరోతో ఎలా ఉండేందుకు అయినా సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY